విగ్రహాల ధ్వంసం కేసులో సంచలన నిజాలు.. ఆ గ్యాంగ్ గుట్టు విప్పిన Chittoor పోలీసులు
Description
FIRST || BEST || ALWAYS
#TOP10NEWSAP#KLREDDY
Please like and subscribe for more interesting updates
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన చిత్తూరు జిల్లాలో నంది విగ్రహం ధ్వంసం కేసును పోలీసులు ఛేదించారు. గుప్త నిధుల కోసం నిందితులు ఈ చర్యకు పాల్పడ్డట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ ఘటనకు సంబంధించి మొత్తం 8 మందిని అరెస్టు చేశారు.అంతర్వేది ఆలయంలో రథం దగ్ధం ఘటన తర్వాత ఏపీలోని పలు దేవాలయాల్లో విగ్రహల ధ్వంసం ఘటనలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చిత్తూరు జిల్లాలో నంది విగ్రహాన్ని కొందరు దుండగులు ధ్వసం చేశారు. ఈ విషయంపై వివిధ పార్టీలు, హిందూ సంఘాలు ఆందోళనలు నిర్వహించాయి. భక్తులు తీవ్రంగా స్పందించారు. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఈ కేసును పోలీసులు ఛేదించారు. మొత్తం 8 మంది నిందితులను అరెస్ట్ చేశారు. గుప్త నిధుల కోసమే వారు ఈ చర్యకు పాల్పడ్డారని పోలీసుల విచారణలో తేలింది. చిత్తూరు జిల్లా ఎస్పీ సెంథిల్ కుమార్ ఈ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఈ నెల 27 న జిల్లాలోని ఆగర మంగళం గ్రామంలోని అభయ ఆంజనేయ స్వామి ఆలయంలోని నంది విగ్రహాన్ని దుండగులు పెకిలించి ఆ తర్వాత ధ్వంసం చేశారని చెప్పారు. ఈ ఘటనపై వెంటనే విచారణ చేపట్టామన్నారు.
మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితులను పట్టుకున్నామన్నారు. ముఠా నుంచి విగ్రహాల ధ్వంసానికి వినియోగించిన పని ముట్లను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ముఠాలో మొత్తం 8 మంది ఉన్నారని తెలిపారు. ఇందులో ఐదుగురు కర్ణాటక వాసులుగా గుర్తించామన్నారు. ఇద్దరు చిత్తూరు, మరొకరు కర్నూలు జిల్లాకు చెందిన వారన్నారు. ఈ ముఠాకు కర్నూలు జిల్లా ఆలూరుకు చెందిన సోమశేఖర్ నాయకత్వం వహిస్తున్నారని ఎస్పీ వివరించారు. గుప్త నిధుల కోసం ఈ ముఠా చిత్తూరు, గుంటూరు, అనంతపురం, కర్నూలు తదితర జిల్లాల్లోని పురాతన ఆలయాల్లో దోపిడీలకు పాల్పడుతూ వచ్చిందన్నారు. గుప్త నిధుల కోసం విగ్రహాలను ధ్వంసం చేయడమే లక్ష్యంగా వీరు పనిచేస్తున్నట్లు ఎస్పీ వివరించారు.వీరు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లోని ఆలయాలు వివరాలు సేకరించి, ఆలయాల్లో గుప్త నిధుల గురించి స్థానికుల నుంచి సమాచారం తెలుసుకుంటారన్నారు. అనంతరం వారు ఎంచుకున్న ఆలయ సమీపంలో తమకు సహకరించే ఒక వ్యక్తిని ఎంచుకుంటారని ఎస్పీ వివరించారు. అతని సహకారంతో ఆ ఆలయంలోని విగ్రహాలు ధ్వంసం చేసి గుప్త నిధుల కోసం తవ్వకాలు జరుపుతారని చెప్పారు. వీరు చిత్తూరు జిల్లా కాణిపాకం, ఎస్.ఆర్.పురం, తిరుపతి, కర్నూలు జిల్లా కర్నూలు, మహానంది, మంత్రాలయం, పత్తికొండ, అనంతపురం జిల్లాలోని పెనుగొండ, కదిరి, గుంటూరు జిల్లాలోని పలు ఆలయాలను పరిశీలించి గుప్త నిధుల కోసం తవ్వకాలు నిర్వహించాలని ప్రణాళికలు రూపొందించారని తమ విచారణలో తేలిందని ఎస్పీ చెప్పారు. ఈ కేసును ఛేదించిన ఎస్ఐలు రాజశేఖర్, విక్రమ్, హెడ్ కానిస్టేబుల్ దేవరాజురెడ్డి, సిబ్బందిని ఎస్పీ అభినందించారు. వారికి రివార్డులు అందజేశారు
Top10 News Channel Is a 24/365 With Top news on the Digital platform,
The Best Place for News in the Best Place on Earth
With Breaking News,Politics Updates, Entertainment News,
Health Updates, Mythology Stories,And Exclusive News.
Comments